కాంగ్రెస్ మాయ మాటలు నమ్మరు
కాంగ్రెస్ మాయ మాటలను ఎవరూ నమ్మరని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు పక్కన నిర్మించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు హాజరై, రూ. 57,524 విరాళంగా అందజేశారు.
- రెండున్నరేండ్లయినా హామీలు నెరవేర్చలేదు
- ఐదుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన సీఎం రేవంత్
- మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యా నాయక్
డోర్నకల్ , జూలై 4 : కాంగ్రెస్ మాయ మాటలను ఎవరూ నమ్మరని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు పక్కన నిర్మించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు హాజరై, రూ. 57,524 విరాళంగా అందజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గొల్లచర్లలోని ఫంక్షన్లో హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, కేసీఆర్పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలకు, దొంగ హామీలకు ప్రజలు మోసపోయారన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని, అలవి కాని వాగ్ధానాలు చేసి రెండున్నరేండ్లయినా నెరవేర్చలేదన్నారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు తులం బంగారం, రూ. 2500, నిరుద్యోగ భృతి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రేవంత్రెడ్డి ఐదు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 73 లక్షల రైతులకు రూ. 72 వేల కోట్ల రైతుబంధు అందజేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఎక్కడ ప్రభుత్వం భూమి ఉందని వెతికి కబ్జా చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నాన్నారు. దగా మాటలు మాట్లాడకుండా ప్రజలకిచ్చిన హమీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని రెడ్యా డిమాండ్ చేశారు. సమావేశంలో మహబూబాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కత్తెరశాల విద్యాసాగర్, మాజీ ఎంపీపీ ధరంసోత్ బాలూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, సర్పంచ్ రాయల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ బానోత్ పాండునాయక్, నాయకులు కొత్త వీరన్న, కాలా యశోధర్ జైన్, కొత్త రాంబాబు, పచ్చిపాల మల్లేశం, కాడెం బాబు, ఇంజం కృష్ణయ్య, మారబోయిన రాంభద్రం, కొండేటి హేమ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

