స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 21 : ఇచ్చిన హమీలను నెరవేర్చని కాంగ్రెస్ వైఫల్యాలను గడప గడపకూ వివరించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరగా, ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ అమలుకు వీలుకాని ఆరు గ్యారెంటీలు, 420 హామీల తో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
వీటిన్నింటి ని తెలియజేస్తూ, బీఆర్ఎస్ పాలనలో వారికందిన సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారికి భవిష్యత్‌లో సముచిత స్థానం, ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్, రఘునాథపల్లి మండల ఇన్చార్జి ముసిపట్ల వి జయ్, కంచనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గవ్వాని నాగేశ్వర రావు, గూడ కిరణ్, లోకుంట్ల సృజన్, గుండె జోసఫ్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.