పాత పథకానికి కొత్త మెరుగులు
బీఆర్ఎస్ పాలనలో గత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించిన వాటర్‌ప్లాంట్‌కు మెరుగులు దిద్ది ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి శిలాఫలకం వేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇదేనా కడియం మార్క్ అభివృద్ధి.. అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
- మాజీ ఎమ్మెల్యే రాజయ్య వేసిన శిలాఫలకంపై ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శిలాఫలకం
- ఇదేనా కడియం మార్కు అభివృద్ధి అని విమర్శలు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పటేల్‌గూడెం వాసులు
లింగాలఘనపురం, ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ పాలనలో గత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించిన వాటర్‌ప్లాంట్‌కు మెరుగులు దిద్ది ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి శిలాఫలకం వేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇదేనా కడియం మార్క్ అభివృద్ధి.. అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లిం గాలఘనపురం మండలం పటేల్‌గూడెంలో ప్రారంభించిన వాటర్‌ప్లాంటు పథకం విమర్శలకు తావిస్తున్నది. ఎంపీ లాడ్స్ నిధులు రూ.3 లక్షలతో పటేల్‌గూడెంలో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా, 4 మే 2016లో అప్పటి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రారంభించారు.
ఈ పథకం కొనసాగుతున్న తరుణంలో ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.2 లక్షలు వెచ్చించి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా ఈ నెల 9న ప్రారంభించారు. అప్పటి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేసిన శిలాఫలకం కనిపించకుండా శ్రీహరి ప్రారంభించడం చర్చనీయమైంది. అధికారుల పని తీరును గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడుతున్నారు. సహజంగా ఒక పోస్టరు వేస్తే దానిపై మరో పోస్టరు వేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఏకంగా ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ శిలాఫలకంపై మరో శిలాఫలకం ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదేనా.. కడియం మార్క్ అభివృద్ధి..?
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి అని పదేపదే జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పటేల్‌గూడెంలో వేసిన శిలాఫలకంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాత పథకానికి మెరుగులు దిద్ది శిలాఫలకం కనిపించకుండా దానిపై మరో శిలాఫలకం వేయడమే కడియం మార్క్ అభివృద్ధా.. అని వారు ప్రశ్నించారు. ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని నాయకులు పెండ్లి శ్రీను, పెండ్లి నాగ మహేందర్, మహిపాల్(టైగర్), ఎర్రరాజు, బుచ్చిరెడ్డి, రాంరెడ్డి, దీకొండ సోమయ్య, మల్లారెడ్డి, పుట్ట రాజు, మైసిరెడ్డి తదితరులు కోరారు.
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి..
నేను సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఎంపీ లాడ్స్ నుంచి రూ.3 లక్షలు మంజూరు చేయించాను. వాటితో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి 4 మే 2016న అప్పటి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు. అయితే, అదే శిలాఫలకంపై తాజా ఎమ్మెల్యే కడియం శ్రీహరి శిలాఫలకాన్ని ఎలా వేస్తారు..? ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
-కడ్దూరి సోమిరెడ్డి, మాజీ సర్పంచ్, పటేల్‌గూడెం
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

