మహదేవపూర్, డిసెంబర్1: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్యనందించాలని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రజా వంచన దినాల్లో భాగంగా మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో ని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సం దర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతులు, సౌకర్యాలపై పరిశీలించేందుకు మధూకర్ ప్రయత్నించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి లేదని సిబ్బంది తెలపడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు, వసతులపై హాస్టల్‌ను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు. గురుకుల, ఆశ్రమ పాఠ శాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, వారి సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డి మాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను మో సం చేసిన ఘనత రేవంత్ సరారుకే దక్కిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడా ది కాలంలో ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
మ్యానిఫెస్టో కమిటీకి చైర్మన్‌గా 420 హామీలకు రూపకల్పన చేశామని గొప్పలు చెప్పుకునే మంథని ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏ ఒక పథకం అ మలు చేయలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లిం గంపల్లి శ్రీనివాస్ రావు, మాజీ సర్పంచ్‌లు శ్రీపతి బాపు, నాగుల లక్ష్మారెడ్డి, పద్మారవీందర్ రెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీతాబాయి, మండల అధ్యక్షురాలు ఓడేటి స్వప్నామల్లారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, సీనియర్ నాయకులు పోత వెంకటస్వామి, పెండ్యాల మనోహర్, అన్కారీ ప్రకాశ్, కారెంగుల బాపు రావు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు జక్కయ్య, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్, జాగృతి మహేశ్, సుంకె మధు తదితరులు పాల్గొన్నారు.