మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు అరిగోస పడుతున్నారని, పంటలకు యూరియా లభించక రైతులు కుటుంబ సభ్యులతో కలిసి సొసైటీల వద్ద రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా రైతులకు యూరియా లభించకపోవడంతో సొసైటీ కార్యాలయాలు, గోదాముల వద్ద పడిగాపులు పడుతున్నారని వివరించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు సాగునీరుతోపాటు ఎరువుల కొరత లేకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహిస్తుంటే వారిని టార్గెట్ చేసుకున్న అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించేలా చర్యలు తీసుకోవాలని గండ్ర డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడారి రమేశ్, జిల్లా నాయకులు బెల్లంకొండ శ్యాంసుందర్‌రెడ్డి, నరహరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారష్ట్