క్యాడర్‌ను బెదిరిస్తే భయపడతామా?
క్యాడర్‌ను బెదిరిస్తే భయపడతామా? అడ్డుగోడలా నిలబడతామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. కేసులు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. సోమవారం నగరంలోని పెద్దమ్మగడ్డ పద్మశాలి భవన్లో 8, 9వ డివిజన్ల ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు సన్నద్ధమవుదామన్నారు.
- అడ్డుగోడలా నిలబడతా..
- కేసులు, పోరాటాలు మాకు కొత్త కాదు
- మాజీ చీఫ్ విప్ వినయ్‌భాసర్
హనుమకొండ చౌరస్తా, జూన్ 8 : క్యాడర్‌ను బెదిరిస్తే భయపడతామా? అడ్డుగోడలా నిలబడతామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. కేసులు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. సోమవారం నగరంలోని పెద్దమ్మగడ్డ పద్మశాలి భవన్లో 8, 9వ డివిజన్ల ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు సన్నద్ధమవుదామన్నారు.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందిపడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేపట్టి ప్రజలకు చేరువయ్యామని, అయితే చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడంతో గత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజాసమస్యల పరిషారం కోసం పోరాడుదామని, ప్రజల తరపున ప్రశ్నిద్దామని పిలుపునిచ్చారు. అధికార పార్టీ, వారికి అనుకూల వర్గాల నుంచి ఎన్ని ఒత్తిడులు, బెదిరింపులు వచ్చినా పార్టీ ని నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.
డివిజన్ల వారీగా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను స్థానిక ప్రజలకు వివరించాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని దాస్యం పిలుపునిచ్చా రు. అనంతరం పార్టీ కోసం పునరంకితమవుదామని ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో డివిజన్ ఇన్చార్జిలు రాజు, కుమార్‌యాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రేటర్ వరంగల్ మాజీ డిప్యూటీ మే యర్ సిరాజుద్దీన్, మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు దర్శన్‌సింగ్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, కుసుమ లక్ష్మీనారాయణ, 8వ డివిజన్ మాజీ అధ్యక్షుడు పులి విక్రమ్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

