కురవి, సెప్టెంబర్ 27: లంబాడీలు, ఆదివాసీ గిరిజనుల మధ్య కొందరు స్వార్థపరులు చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని, దీనిని అందరూ ఐక్యం గా నిలిచి వీరి కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మం త్రి సత్యవతిరాథోడ్ అన్నారు. లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించిన హకు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్ద తండాలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆమె మాట్లాడారు.
ఎస్టీ రిజర్వేషన్ లంబాడీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, తాము ఎవరికీ వ్యతిరేకంగా కాదని తెలిపా రు. కొందరు కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె వివరించారు. రిజర్వేషన్ తొలగించాలని కొందరు గతంలో హైకోర్టుకు వెళ్తే కోర్టు పరిధిలో లేదని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. అ యినా కొందరు పెట్టిన చిచ్చుతో సుప్రీంకోర్టు వరకు ఈ సమస్య వెళ్లిందన్నారు. 1976లో పార్లమెంటు లో రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఎరుకల, ఏనా ది, లంబాడీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారని సత్యవతిరాథోడ్ తెలిపారు.
లంబాడీల్లో కొంద రు బాగుపడితే అందరూ బాగుపడినట్లు కాదని, ఇంకా చాలా చోట్ల కడుపులోనే శిశువులను అమ్ముకునే దీనస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏ పార్టీకి సంబంధంలేదని, లంబాడీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లాలో లంబాడీలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. అందుకే ఆత్మగౌరవ సభ ను మహబూబాబాద్‌లో ఈ నెల 28న నిర్వహిస్తున్నందున విజయవంతం చేయాలని సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు గుగులోత్ శ్రీరాంనాయక్, రాందాస్ నాయక్, సిరినాయక్, బిచ్చు, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.