కురవి : మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు యూరియా కష్టాలు తప్పడంలేదు. ఆమె స్వగ్రామం కురవి మండలం పెద్దతండా గ్రామం గుండ్రాతిమడుగు(విలేజ్) సొసైటీ పరిధిలోకి వస్తుంది. సత్యవతి రాథోడ్‌కు సొంత ఊరులో ఐదున్నర ఎకరాల భూమి ఉంది.
అందులో వివిధ పంటలను సాగు చేయి స్తోంది. నెలరోజులుగా యూరియా దొరకకపోవడంతో ఆదివారం ఆమె నేరుగా గుండ్రాతిమడుగు సొసైటీ వద్దకు వచ్చి కూపన్ కోసం లైన్లో నిల్చుంది. గంట పాటు వేచి ఉన్న తర్వాత అధికారులు ఒక బస్తాకు కూపన్ ఇచ్చారు. ఆ తర్వాత యూరియా బస్తా తీసుకున్నారు.