కరీమాబాద్ ఫిబ్రవరి17 : తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఖిలావరంగల్ మండలం 43 వ డివిజన్ నాయుడు పెట్రోల్ చౌరస్తా వద్ద తెలంగాణ సాధకుడు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు71వ జన్మదిన వేడుకలను(KCR birhday) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చాడన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువలా కొనసాగి పారిశ్రామిక అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాళ తీసిందని విమర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.