రాయపర్తి/కరీమాబాద్/ఐనవోలు, ఏప్రిల్ 22 : బీఆర్ఎస్ ఉద్యమ పోరాటాలు, గత పదేండ్లలో అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు విడమరిచి చెబుతూ బహిరంగ సభకు వచ్చేలా చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.
మంగళవారం రాయపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అధ్యక్షతన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించా రు. అలాగే వరంగల్ 43వ డివిజన్లో సభ కోసం తరలిరావాల ని ప్రచారం చేపట్టారు. గోడలకు వాల్‌పోస్టర్లు అతికించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజలను తెలంగాణ ఉద్య మ స్ఫూర్తితో తరలించాలని అన్నారు.
కార్యక్రమంలో రైతుబంధు సమి తి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, కర్ర రవీందర్‌రెడ్డి, లేతాకుల రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, బద్ధం వేణుగోపాల్‌రెడ్డి, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్, కుందూరు యాదగిరిరె డ్డి, చిలువేరు సాయిగౌ డ్, చందు రామ్యాద వ్, ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్లస్వామి, పోలెపాక భిక్షపతి, చందు సతీష్‌యాదవ్, గబ్బెట యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక
ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ కంజర్ల రమేశ్, మాజీ ఉపసర్పంచ్ బొల్లం ప్రకాశ్‌తో పాటు సుమారు 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి దయాకర్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొందపెట్టే రోజులు వస్తాయన్నారు.
పార్టీలో చేరిన వారిలో కాటబోయిన కుమారస్వామి, గాడుదల లింగయ్య, చిర్ర రాజేందర్, తల్లపెల్లి నాగరాజు, మడ్లపల్లి రాజు, ఆరూరి అరుణ్, నూనె సాంబరాజు, జోగు సతీశ్, జోగు రమేశ్, ఆరూరి లలిత, ఆరూరి పూల, బర్ల సుమలత, అరూరి అనిత తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చందర్రావు, మం డల కన్వీనర్ తంపుల మోహన్, మండల ఇన్చార్జి గుజ్జ గోపాల్‌రావు, మాజీ సర్పంచ్ సురేశ్, గ్రా మ పార్టీ అధ్యక్షుడు సోమయ్య, నాయకులు దేవదాసు, రఘువంశీ, కొంరయ్య పాల్గొన్నారు.