దేవరుప్పుల, ఆగస్టు 14: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ హవానే కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఇదే తే లింది. దీంతో ఎలక్షన్లు పెట్టాలంటే వణుకుతున్న రా ష్ట్ర ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుంది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ జయకేతనం చాటుతుందన్నారు.
తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ర్టాన్ని దివాలా తీయించడమేకాక, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని సర్కారుపై జనాగ్రహం ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆలస్యంగా కురిసిన వర్షాలతో రైతులు అరకొర నాట్లుపెట్టగా యూరియా కొరతతో సతమతమవుతున్నారని, ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఎరువుల దుకాణాల ఎదుట పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు.
అధికారానికి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని అరకొర అమలు చేసి చేతులు దులుపుకున్న రేవంత్‌రెడ్డిని మోసగాడుగా ప్రజలు అభివర్ణిస్తున్నారని, బఫూన్ కింద జమ కడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని దివాలా తీయించి తెలంగాణ ద్రోహిగా ముద్రపడనున్నారన్నా రు. ముఖ్యంగా హైదరాబాద్ వార్షికాదాయం సగానికి సగం తగ్గడంతో, రాష్ట్రం అప్పుల కుప్పగా మారందన్నారు. బీఆర్ఎస్పై అనవసర అభాండాలు వేసి కాలం వెల్లదీస్తున్న రేవంత్‌రెడ్డికి స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇది ఆయనను గద్దె దింపే వరకు వెళ్తుందన్నారు.
కాళేశ్వరం, ఫోన్ ట్యాపిం గ్, రేసింగ్‌లపై విచారణల పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. స్థ్ధానిక సంస్థల ఎన్నికలు వస్తే పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, అత్యధిక సర్పంచ్‌లు గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండల నాయకుడు పల్లా సుందరరాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేశ్, ఏల సుందర్, చింత రవి, కొత్త జలేందర్‌రెడ్డి, ఉప్పల్‌రెడ్డి, కుతాటి నర్సింహులు, సంజీవరెడ్డి, తోటకూరి కిష్టయ్య, తిరుమలేశ్, కారుపోతుల యాదగిరి, తాళ్లపల్లి మహేశ్ తదితరులు ఉన్నారు.