తొర్రూరు, మే 19: పట్టభద్రుల పక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే సత్తా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి ఉన్నదని, ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం తొర్రూరులోని శ్రీనివాస గార్డెన్లో నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నేటికీ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రా లు ఇచ్చి 30వేల ఉద్యోగాలు కల్పించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేట న్నారు.
అలాంటి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి మీడియా ముసుగులో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ అడ్డగోలు అక్రమాలు చేశాడని, అతడిని గెలిపిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకంగా మారుతుందన్నారు. విద్యావంతులైన పట్టభద్రులంతా పోరాడే పటిమ ఉన్న రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా బీఆర్ఎస్ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ నెల 22న తొర్రూరులో నిర్వహించనున్న పట్టభద్రుల బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ తూర్పాటి చినఅంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పాలకుర్తి నియోజకవర్గ సమన్వయకర్త పొనుగోటి సోమేశ్వరరావు, తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్దవంగర మండలాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు పాల్గొన్నారు.