పాలకుర్తి రూరల్/కొడకండ్ల, ఆగస్టు 10 : మా తండాలో మా రాజ్యం ఆకాంక్షను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నెరవేర్చారని, బీఆర్ఎస్ పాలనలోనే తండాలను జీపీలుగా మార్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి మండలం దుబ్బతండా, మేకల తండాలను ప్రత్యేక జీపీలుగా మార్చేందుకు కృషి చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావును శనివారం తండావాసులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ పరిపాలన సౌ లభ్యం కోసం బీఆర్ఎస్ పాలనలోనే తం డాలను జీపీలుగా గుర్తించామన్నారు. మరికొన్నింటిని జీపీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు.
అనంతరం గూడూరు, విస్నూరు, చెన్నూరులో ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎర్రబెల్లి పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, తాడేం రవి, ధరావత్ యాకూబ్, గుగులోత్ వాసునాయక్, దేవేందర్, వీరన్న, లక్పతి, నర్సింహ, నకీర్త యాకయ్య, మాటూరి యాకయ్య, పుస్కూరి రాజేశ్వర్‌రావు, కారుపోతుల వెంకటయ్య, వేణు, అల్లమనేని రమేశ్‌రావు, చింతకింది ఉపేదర్, గుగులోత్ దేవా, కమ్మగాని నాగన్న పాల్గొన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం కొడకండ్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు సిందె రామోజీ అద్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అ సెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఎర్రబెల్లి కోరారు.
తాను పార్టీ మారుతానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని ఎవరూ నమ్మొద్దన్నారు. త్వరలోనే గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సోషల్‌మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పేరం రాము, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు, సొసైటీ వైస్ చైర్మెన్ మేటి సోమరాములు, బీఆర్ఎస్ నాయకులు చెంచు రాజిరెడ్డి, బాకీ ప్రేమ్‌కుమార్, ఎండీ ఆసీఫ్, జక్కుల విజయమ్మ, మసురం వెంకటనారాయణ పాల్గొన్నారు.
అనంతరం రేగుల తండా మాజీ ఉప సర్పంచ్ సోదరుడు దవాఖానలో చికిత్స పొం దుతూ మృతి చెందగా మృతదేహాన్ని ఎర్రబెల్లి సందర్శించి నివాళులర్పించారు. ఏడునూతులకు చెందిన బీరం సుదర్శన్ రెడ్డి సతీమణి సావిత్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు ఎలికట్టె సోమన్న, లింగయ్య తదితరులు ఉన్నారు.