అబద్ధాల్లో రేవంత్‌కు ఆస్కార్ ఇవ్వాలి
ఆరు గ్యా రెంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేయడం కాదు, నీ బిడ్డపై ఒట్టేసి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దవంగర మండలంలోని అవుతాపురం, పో చంపల్లి, గంట్లకుంట, కొరిపెల్లి, వడ్డెకొత్తపల్లి, పెద్దవంగర, చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
- ఒట్లు దేవుళ్లపై కాదు.. నీ బిడ్డపై పెట్టు
- పెద్దవంగరలో ప్రచారంలో మాజీ మంత్రి దయాకర్‌రావు
- లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని స్పష్టం
పెద్దవంగర, మే 5 : ఆరు గ్యా రెంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేయడం కాదు, నీ బిడ్డపై ఒట్టేసి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దవంగర మండలంలోని అవుతాపురం, పో చంపల్లి, గంట్లకుంట, కొరిపెల్లి, వడ్డెకొత్తపల్లి, పెద్దవంగర, చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అబద్ధాల్లో సీఎం రేవంత్‌రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చన్నారు. రేవంత్‌రెడ్డి అక్రమాల పుట్ట అని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడన్నారు. కడియం శ్రీహరిది ఏ కులమో ప్రత్యక్షంగానే రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే బీఆర్ఎస్ లేని లోటు కనిపిస్తోందన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 8 నుంచి 10 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన కడియం శ్రీహరికి రాజకీయ సమాధి తప్పదన్నారు. బీజేపీలో చేరిన అరూరి రమేశ్ వర్ధన్నపేట ప్రజలను మోసం చేశాడని, మోసం చేసిన వాళ్లకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హా మీలు నెరవేరాలంటే బీఆర్ఎస్ తప్పక గెలవాలని అన్నారు. కార్యక్రమంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, నాయకులు రామచంద్రయ్యశర్మ, యాదగిరిరావు, సునీల్‌కుమార్‌రెడ్డి, సుధీర్‌కుమార్, మనోహర్‌గౌడ్, విజయ్‌పాల్‌రెడ్డి, కృష్ణమూర్తి, సత్యనారాయణ, వెంకట్‌రెడ్డి, జ్ఞానేశ్వరాచారి, సమ్మయ్య, వేణుగోపాల్‌రావు, ప్రదీప్‌రావు, ఉష య్య, శ్రీనివాస్, రాము, వెంకట్రామయ్య, వెంకన్న, రవి, హరీశ్‌యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

