కాశీబుగ్గ, ఏప్రిల్ 4 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఐదు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి క్యారం సంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 5న శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, 6,7న శని, ఆదివారాలు వారాంతపు సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది పండుగ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. 10న మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.
ఈ నెల 11,12, రంజాన్ పండుగ, 13, 14న శని, ఆదివారాలు వారాంతపు బంద్ అని మార్కె ట్ అధికారులు తెలిపారు. మొత్తం 9రోజులు మార్కెట్‌కు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.