గిర్మాజీపేట, అక్టోబర్ 30: బీఆర్ఎస్ పేదల తరఫున కొట్లాడే పార్టీ అని, విద్యుత్ చార్జీలు పెంచకుండా పోరాడిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కే దక్కుతుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రూ. 18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారం తెలంగాణ ప్రజలపై పడకుండా చేసిన కేటీఆర్ పిలుపుమేరకు బుధవారం శివనగర్‌లోని తన ఇంటి ఆవరణలో బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై రూ. 18,500 కోట్ల భారాన్ని మోపాలని చూసిందని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కేటీఆర్ పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని విద్యుత్ చార్జీలు పెంచకుండా ఈఆర్సీని ఒప్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని, ఆ పార్టీ కార్యకర్తలకు ఉచిత విద్యుత్ వస్తుందా.. గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని కోరారు. కళ్లబొల్లి మాటలు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దీపావళి పండుగ పూట తెలంగాణ ప్రజల గుండెల్లో విద్యుత్ ధరల పెంపు బాంబు పేల్చకుండా బీఆర్ఎస్ అడ్డుకుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మార్కెట్ మాజీ చైర్మన్ తుమికి రమేశ్‌బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయించిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు. మహేశ్వరం శివారులోని నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో బుధవారం బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డిస్కం ద్వారా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 18,500 కోట్ల భారం మోపాలని చూసిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల గృహ వినియోగదారులు, పరిశ్రమలకు జరిగే నష్టాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈఆర్సీ కమిటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని, ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ఉండేలా ఆర్డర్స్ ఇవ్వాలని వివరించారన్నారు. దీంతో ఈఆర్సీ కమిటీ విద్యుత్ చార్జీలు పెంచకుండా తీర్పును వెల్లడించిందన్నారు. ఈ తీర్పు ప్రజల విజయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, క్లస్టర్ ఇన్చార్జీలు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోటూరి రవి, కొడారి రవన్న, తాళ్లపల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్‌రెడ్డి, కడారి కుమారస్వామి, భూక్యా వీరన్న, వల్లాల కరుణాకర్‌గౌడ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, మంచిక రాజుగౌడ్, బండారి మల్లయ్య, భూక్యా వీరన్న, పోటు రాయపురెడ్డి, బానోత్ శంకర్, పెండ్యాల ప్రభాకర్, ఆంగోత్ సుధాకర్లాల్, చేరాల గోవర్ధన్, నర్సింగం, బండారి రమేశ్, పత్రి కుమారస్వామి, చిన్నపెల్లి నర్సింగం, పాత్కాల కొమ్మాలు, జినుకల విజేందర్, చాపర్తి భిక్షపతి, పొన్నం రమేశ్, సాంబరాజ్యం, వెంకటేశ్వర్లు, దేవేందర్, అశోక్, భీరం మాధవరెడ్డి, పెండ్యాల మునేందర్, నర్సింగం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాయపర్తి : కరెంట్ చార్జీలు పెంచేందుకు యత్నించిన కాంగ్రెస్ సర్కార్‌కు ముచ్చెమటలు పట్టించిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని పార్టీ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ అన్నారు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడుతూ 420 అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, ఆకుల సురేందర్‌రావు, కుందూరు రాంచంద్రారెడ్డి, పూస మధు, నయీం, కర్ర రవీందర్‌రెడ్డి, కాశీనాథం, జాజునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, వేణు, యాదగిరిరెడ్డి, రంగయ్య, భాస్కర్, సుధాకర్, రామ్‌యాదవ్, ప్రసాద్, ప్రభాకర్, అక్బర్, కుమార్, చిలువేరు సాయిగౌడ్, సింహాద్రి, అశోక్, ఉపేందర్, ఉప్పలయ్య, జగన్, రవి, మధు పాల్గొన్నారు.