Warangal | వర్ధన్నపేట, ఏప్రిల్ 13 : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జంగాల కాలనీలో ఘోరం జరిగింది. ఓ గుడిసెలో ప్రమాదవవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో ఆ గుడిసె మొత్తం కాలిపోయింది. ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు, రూ. 15 వేల నగదు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితుడు కడెం రాజు, ఆయన తండ్రి మల్లయ్య కన్నీరు పెట్టుకున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం సాయం చేయాలని వారు వేడుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.