హనుమకొండ, అక్టోబర్ 6: కాకతీయ విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకుడు డాక్టర్ తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో విభాగంలోని సహా అధ్యాపకులు ముందుకొచ్చి ఆర్థిక సహకారం అందించారు. విభాగంలోని అధ్యాపకులు కలిసి మొత్తం రూ.60,500 సేకరించి, అధ్యాపకుని కుమార్తె భవిష్యత్ విద్య కోసం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారు.
ఈ సందర్భంలో అధ్యాపకులు, విద్యార్థులు మరణించిన సహచరుడి సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి ధైర్యాన్ని అందించి, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో త్రికోవెల భిక్షపతి, సత్యనారాయణ, రాంబాబు, రాజిరెడ్డి, రాము, బాలకృష్ణ, విజయకుమార్, విమల, వింధ్యరాణి, లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, స్వామి ఉన్నారు.