హనుమకొండ, జనవరి 6 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,318 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 30,49,540 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 14,90,056 మంది కాగా, మహిళలు 15,51,289, ట్రాన్స్జెండర్లు 504, సర్వీస్ ఓటర్లు 2,141 మంది. ప్రత్యేక ఓటరు నమోదు అనంతరం తుది జాబితాను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అన్ని జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో అత్యధిక ఓటర్లుండగా, ములుగులో తక్కువ మంది ఉన్నారు.
కాగా హనుమకొండ జిల్లాలో 483 పోలింగ్ స్టేషన్లుండగా 2,48,363 మంది పురుషులు, 2,59,99 8 మహిళలు, 18 మంది ట్రాన్స్జెండర్లు, 239 మంది సర్వీస్ ఓటుర్లు కలిపి 5,08,618 మంది ఓటర్లున్నారు. అలాగే వరంగల్ జిల్లాలో 795 పోలింగ్ స్టేషన్లుండగా పురుషులు 3,76,965, మహిళలు 3,95,4 89, ట్రాన్స్జెండర్లు 370, సర్వీస్ ఓటర్లు 629, మొత్తం కలిపి 7,73,453 మంది ఓటర్లున్నారు.
జనగామ జిల్లాలో 865 పోలింగ్ స్టేషన్లు, పురుషులు 3,75,729, మహిళలు 3,86,335, ట్రాన్స్జెండర్లు 28, సర్వీస్ ఓటర్లు 464 కలిపి 7,62,106 మంది ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 555 పోలింగ్ స్టేషన్లలో పురుషులు 2,37,543, మహిళలు 2,47,715, ట్రాన్స్జెండర్లు 54, సర్వీస్ ఓటర్లు 380 కలిపి 4,85,692 మంది ఉన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 317 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పురుషులు 1,36,952, మహిళలు 1,41,022, ట్రాన్స్జెండర్లు 8, సర్వీస్ ఓటర్లు 203 కలిపి 2,78,185 మంది ఉన్నారు. ములుగు జిల్లాలో 303 పోలింగ్ స్టేషన్లలో పురుషులు 1,14,504, మహిళలు 1,20,730, ట్రాన్స్జెండర్లు 26, సర్వీస్ ఓటర్లు 226 కలిపి 2,35,486 మంది ఉన్నారు.