హనుమకొండ చౌరస్తా, మే 21: హనుమకొండ ఫీల్డ్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం హనుమకొండ లష్కర్‌బజార్‌లోని పోల సమాజం కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఫీల్డ్ ప్రెసిడెంట్‌గా గంధం అరుణ్జేమ్స్, వైస్ ప్రెసిడెంట్‌గా డేవిడ్ రాజ్‌కుమార్, సెక్రటరీగా మేకల డానియేలు(చంద్రమౌలి), జాయింట్ సెక్రటరీగా అబ్బుకల్లు గోపాల్, ట్రెజరర్‌గా తీగల మోహన్, జాయింట్ ట్రెజరర్‌గా పోలెపాక సీతయ్య, రికార్డింగ్ సెక్రటరీగా నలిగంటి అన్వేష్, ఈసీ మెంబర్స్‌గా మేరుగు యోసిపు, జేమ్స్ ఎబినేజర్, కె.విజయరావు, మేకల శ్యాంసుందర్, కె.నరేష్, అబ్రహంను ఎన్నుకున్నారు. ఫార్మర్ అధ్యక్షుడు గందం జోషిజేమ్స్మృతి చెందడంతో కొత్త అధ్యక్షులతో పాటు నూతన కార్యవర్గాన్ని ఏగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Theme Of Gajapathi | ప్రతీ బీట్‌లో రాజసం, క్రూరత్వం.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా భైరవం థీమ్ ఆఫ్ గజపతి
Chattishgarh | ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు హతం..!
Amir Hamza | ప్రాణాపాయ స్థితిలో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు