రేగొండ : కన్న కొడుకునే అతి దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన సంఘటన మంగళవారం జయశంకర్ జిల్లా రేగొండ మండలం రేపాక పల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేపాకపల్లె గ్రామానికి చెందిన కాసం మొండయ్య తన కొడుకు ఓదెలకు ఇద్దరి మధ్య సోమవారం రాత్రి ఘర్షణ జరిగింది.
కాగా, ఇంట్లో నిద్రిస్తున్న ఓదెలపై మంగళవారం ఉదయం తండ్రి మొండయ్య కర్రతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం మొండయ్య రేగొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇరువురి మధ్య ఘర్షణ కారణంగానే కన్న కొడుకును అతి దారుణంగా తండ్రి చంపడని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.