మొగుళ్లపల్లి, జూలై 19 : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంబురంగా సాగు పనులు చేస్తే.. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కరెంట్, నీళ్లు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. నాడు సాగుకు పెట్టుబడి సాయం రైతుబంధు ఇవ్వడమే కాకుండా ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందజేయడంతో రైతులు అప్పుల పాలుకాకుండా పంటలు పండించారు. కానీ, నేడు ఒక్క యూరియా బస్తా కోసం కూడా చెప్పులు క్యూలైన్లో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
తాజాగా జయశంకర్ భూపాపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట రైతులు యూరియా కోసం ఉదయం నుండి పడిగాకులు కాస్తున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కో రైతులు ఉదయం నుండి తమ చెప్పులను క్యూ లైన్ లో పెట్టి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మండల రైతులకు సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.