ఖిలావరంగల్/మహబూబాబాద్ రూ రల్, డిసెంబర్ 9: రుణమాఫీ ఎప్పుడు చేస్తరు? బ్యాంకు, వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరిగి యాష్టకొస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జి ల్లా నెక్కొండ మండలం అలంకానిపేట, మహబూబాబాద్ మండలం మాధవాపు రం, కురవి మండలం బంజారాతండా రైతు లు ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట సోమ వారం నిరసన తెలిపారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదన్నారు.
నెక్కొండలో ని ఐవోబీలో 1500 మంది రైతులకు ఖాతాలుండగా ఇందులో 600 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. మిగతా 900 మందికి అధికారుల తప్పిదంతో మాఫీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల నుంచి బ్యాంకులు, వ్యవసాయ అధికారులకు ఆధార్ కార్డ్‌లు, పాస్‌బుక్స్ జిరాక్స్‌లు ఇస్తున్నా రుణ మాఫీ మాత్రం కావడం కాలేదని పేర్కొన్నారు. రేషన్‌కార్డ్ లేదని, ఆధార్‌లో పేరు తప్పుగా ఉందని సాకులు చెబుతున్నారని, ప్రభుత్వం కూడా సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులు పెడుతున్నదన్నారు. అనంతరం అదనపు కలెక్టర్లు జీ సంధ్యారాణి, వీరబ్రహ్మచారికి రైతులు వినతి పత్రాలు సమర్పించారు.
ఐవోబీలో రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతులం 50 శాతం ఉ న్నం. ప్రభుత్వం రుణమాఫీ చేసినం అంటున్నది. చేస్తే మాకు ఎందు కు కాలేదు. సన్న, చిన్నకారు రైతులకే రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డని, ఆధార్ కార్డని ఏవేవో సాకులు చెబుతూ రోజులు దాటవేస్తున్నది. వెంటనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. రూ.లక్షా 25 వేలు రుణం తీసుకుంటే మాఫీ కాలేదు.
– రాజిరెడ్డి, అలంకానిపేట, నెక్కొండ