జనగామ రూరల్, మార్చి13 : పంటలు ఎండినంక నీళ్లస్తరా?, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం గానుగుపహాడ్-వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేశారు. గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, మరిగడి, వెంకిర్యా ల, వడ్లకొండ తదితర గ్రామాల రైతులు జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయిం చారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ బొమ్మకూర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు వస్తుండడంతో కిందకు విడుదల చేసి ఎండిపోయిన పంటలకు జీవం పోయాలన్నారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలకు నీరు విడుదల చేస్తే కాపాడుకుంటామని, లేకుంటే చావే శరణ్యమ న్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతో చని స్థితిలో ఉన్నామని, అందుకే రోడ్డెక్కామని తెలిపారు. ఉన్న పంటను కాపాడుకుందామంటే వచ్చీరాని కరెంట్‌తో మొదటి దొయ్యనే పారుతున్నదన్నారు. ఇలాంటి కష్టం ఎవ్వరికీ రావొద్దన్నా రు. పక్కనే రిజర్వాయర్ ఉండి, గ్రామాలకు గోదావరి కాల్వలు ఉన్నా మా గ్రామాలకు నీరు రావడం లేదంటే ఎవరి తప్పిదమో అర్థం కావడం లేదన్నారు. గత ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోసేవని, కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తే వద్దని అధికారులకు చెప్పిన రోజులు ఉన్నాయని, నేడు నీళ్లు కావాలని రోడ్లపైకి వచ్చే రోజులు వచ్చాయని పేర్కొన్నారు.
ధర్నా వద్దకు ఇరిగేషన్ డీఈ శ్రవణ్ వచ్చి మాట్లాడుతూ శనివారం వరకు నీటిని విడుదల చేస్తామ ని తెలిపారు. రైతు లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు వచ్చి రైతులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు రైతులు వినతిపత్రం అందజేసి తమ గోడును వెల్లబోసుకున్నారు. రిజర్వాయర్ లెవల్‌కు రాగానే నీటిని విడుదల చేస్తామని, రైతులు ఎవరూ ఇబ్బందులు పడకుండా అధికారులకు ఆదేశాలిస్తానని కలెక్టర్ తెలిపారు.