హనుమకొండ, నవంబర్ 17: కాంగ్రెస్ పాలన రైతులను కష్టాల్లోకి నెట్టిందని, మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు తాటి కొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కనీసం పంటలు కొను గోలు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉంద ని అన్నారు. కేసీఆర్ రైతు సాయంగా ఎకరాకు రూ. 10 వేలిస్తే.. అధికారంలోకి వస్తే తాము రూ. 15 వేలిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలున్న రెండు సార్లు మాత్రమే రైతుబంధు ఇచ్చి చే తులు దులుపుకుందని విమర్శించారు.
24 గంటల కరెంటుకు బదులు 12 గంటలే వస్తుందన్నారు. రైతుబీమాకు రాంరాం చెప్పి.. పంటను కొనక రైతు లను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోనే సుమారు 7లక్షల మంది పత్తి రైతులు ఉంటారని, పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతుంటే రైతులు నష్టపోరా అని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో కొనుగోలు నిరాకరిస్తున్న సీసీఐ వైఖరిని నిరసిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంపై జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, వ్యవసాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పత్తి క్వింటాల్‌కు రూ. 8110 మద్దతు ధర ఉంటే సర్కారు కొనుగోలు చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో రూ. 6నుంచి 7వేలకు అమ్మి నష్టపోతున్నారన్నారు. సీసీఐ, దళారులు కలిసి రైతులను దగా చేస్తున్నారన్నారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ రైతు డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని దాస్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నయీమొద్దీన్, నరెండ్ల శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రైతు సమస్యలను ప్రస్తావించే శక్తి లేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తక్షణమే రాజీనామా చేయాలి. రైతు సమస్యలను గాలికొదిలేసి మంత్రులు రాజకీయాలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో అకాల వర్షాలకు పత్తి తడిచింది. నాణ్యత లేదని కుంటి సాకులు చెబుతూ పత్తి కొనుగోలు చేయకపోగా, రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదు. మిల్లర్లు సమ్మెకు దిగడంతో పత్తి కొనుగోలు ఆగిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైన విధానం లేదు. సీసీఐ ఉండగా ఇంపార్టెంట్ డ్యూటీస్ తగ్గించడంతో విదేశాల నుంచి పత్తి కొనుగోలు చేయడం వల్ల ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేసి మద్దతు ధర క్వింటాకు రూ.8110 చెల్లించాలి. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించి, వడ్లకు బోనస్ డబ్బులు చెల్లించాలి. లేకుంటే రైతుల పక్షాన మా కార్యాచరణ ఉధృతం చేస్తాం.
పత్తి రైతులు గోసపడుతుంటే రేవంత్‌రెడ్డి స రారు మొద్దు నిద్రలో ఉంది. తేమ పేరిట కొ నుగోళ్లు నిరాకరించడం, ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని సీసీఐ కొత్త నిబంధనలు పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నది. ప్రైవేట్ దళారులకు అమ్మే పరిస్థితి ఏర్పడి క్వింటాకు రూ. 1,300 నష్టపోతూ దోపిడీకి గురవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 55 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయో జనం లేదు. మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మారెట్ను మాజీ మంత్రి హరీశ్‌రావు సందర్శించి పత్తి రైతులతో ప్రత్యక్ష ఇంటరాక్షన్ నిర్వహిస్తారు. పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుంది. జూబ్లీహిల్స్ ఓటమి తమపై బాధ్యతను మరింత పెంచింది.
– మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య