రోడ్డెక్కిన మక్క రైతు
మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రో జులు, వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. సమయానికి సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కాంటాలు పెట్టడంలో ఆలస్యం.. గన్నీ సంచుల కొరతతో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వ్యవసాయ మారెట్ యార్డులో కాంటాలు పెట్ట డం లేదని రైతులు రహదారిపై కర్రలు అడ్డుపెట్టి రాస్తారోకో చేపట్టారు.
- కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం
- ఉమ్మడి జిల్లాలో ధర్నాలు, రాస్తారోకో
నమస్తే తెలంగాణ నెట్వర్క్: మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రో జులు, వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. సమయానికి సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కాంటాలు పెట్టడంలో ఆలస్యం.. గన్నీ సంచుల కొరతతో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వ్యవసాయ మారెట్ యార్డులో కాంటాలు పెట్ట డం లేదని రైతులు రహదారిపై కర్రలు అడ్డుపెట్టి రాస్తారోకో చేపట్టారు. కాంటా వేసిన బస్తాలను లారీల్లో ఎకించే వరకు కాపలాగా ఉండాల్సి వస్తున్నదని, ఇండ్ల నుంచి భోజనాలు తెచ్చుకొని మారె ట్ యార్డు వద్దే రోజుల తరబడి గడపాల్సి వస్తోందని వాపోయారు.
కేసముద్రం వ్యవసాయ మార్కె ట్ గేట్ మూసి ఉండడంతో మక్కల లోడ్తో వచ్చి న సుమారు 80 ట్రాక్టర్లు, 20 ఆటోలు మార్కెట్ ఎదుట బారులు తీరాయి. బయ్యారం మండలం కస్తూరినగన్, బయ్యారం, కొత్తపేట, కంబాలపల్లి, ఉప్పలపాడు, రామచంద్రాపురం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు లేక పోవడంతో కాం టాలు నిలిచి పోయాయి. మక్కలు తీసుకొచ్చి 20 రోజులు దాటినా నిర్వాహకులు కాంటాలు పెట్టడం లేదని సీపీఎం, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు ఇనుగుర్తి మండల కేంద్రంలో కేసము ద్రం- నెల్లికుదురు ప్రధాన రహదారిపై బైఠాయిం చారు.
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం లో మకల కొనుగోలు కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ రైతు సహకార కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెల రోజులు కావొస్తున్నా కాంటాలు వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల క్రితం మక్కలు తీసుకొచ్చామని, కాంటాల కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నామని రైతులు తెలిపారు. మక్కల కొనుగోళ్లలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ.., వరంగల్ జిల్లా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట మండల కేంద్రంలో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

