మహబూబాబాద్ రూరల్, నవంబర్ 21 : హైకోర్టు అనుమతితో ఈ నెల 25న (సోమవారం) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతుల మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే రైతుల మహాధర్నాకు ఎస్పీ అనుమతి ఇవ్వకుండా ఒత్తిడి చేశారని ఆరోపించారు. మానుకోటలో కేటీఆర్ వచ్చి గిరిజన రైతుల పక్షాన పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని రేవంత్‌కు భయం పట్టుకుందని పేర్కొన్నారు. 25న భారీగా రైతులను సమీకరించి కేటీఆర్‌తో జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.