నల్లబెల్లి, జూలై 13: ప్రైవేట్ డీలర్ యూరి యా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని రైతులు పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నానికి పా ల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ ల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి. బిల్యానాయక్తండాకు చెందిన రైతులు ధన్‌రాజ్‌నాయక్, జుమ్కిలాల్ మండల కేం ద్రంలోని కర్ర కృష్ణారెడ్డి ఎరువుల దుకాణం వద్దకు వెళ్లి తమకు యూరియా బస్తాలు కావాలని అడగగా లేదని సమాధానమిచ్చాడు.
దీంతో 1200 బస్తాల యూరియా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇవ్వడం లేదంటూ డీలర్ గోదాం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ ఘటనా స్థలానికి చేరుకొని రైతుల నుంచి పెట్రోల్ డ బ్బాను లాక్కొ ని సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. అలా గే సంబంధిత ఏవో రజితతో ఎస్సై ఫోన్లో మాట్లాడగా డీలర్ వద్ద 1200 బస్తాల యూరి యా ఉన్నది వాస్తవమేనని, దాన్ని రైతులకు విక్రయించకపోవడం నేరమన్నారు. డీలర్‌పై చర్యలు తీసుకుంటామని ఏవో తెలిపారు.
ప్రైవేట్ డీలర్లకు అండగా అధికారులు
ప్రైవేట్ డీలర్లకు వ్యవసాయశాఖ అధికారులు అండగా నిలుస్తుండడంతోనే వారు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రైవేట్ డీలర్ వద్ద 1200 యూరియా బస్తాలున్నప్పటికీ వాటిని విక్రయించక పోవడంతో పీఏసీఎస్‌తో ఆగ్రోస్ కేంద్రాల వద్ద మేము రోజంతా లైన్లు కడుతున్నాం. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు అవసరం మేరకు యూరియా పంపిణీ చేసేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
– ధన్‌రాజ్‌నాయక్, రైతు, బిల్యానాయక్ తండా