తొర్రూరు/దంతాలపల్లి, మే 19 : తొర్రూరు పట్టణంలోని పీఏసీఎస్ గోదాము వద్ద మకల లోడ్ ట్రాక్టర్లు ఐదు రోజులుగా బారులు తీరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కేవలం 9 మంది హమాలీలతో రోజుకు కేవలం 10 నుంచి 20 ట్రాక్టర్లను మాత్రమే దిగుమతి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వందలాది మకల లోడ్ ట్రాక్టర్లు గోదాము వద్దే బారులు తీరుతున్నాయని, రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.
ఐదు రోజులుగా గో దాము వద్దే రాత్రి పగలూ ఉంటున్నామని, హోటళ్లల్లో భోజనం చేస్తూ కాపలా కాస్తున్నామంటున్నారు. ట్రాక్టర్లు గోదాము వద్దే నిలిచిపోవడంతో రో జుకు రూ.2వేల వరకు అదనపు కిరాయి భారం పడుతున్నదని వాపోతున్నారు. అలాగే దంతాలపల్లి మండలంలో మక్కలు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రెండు నెలలవుతున్నా ప్రభుత్వం కాంటాలు పెట్ట డం లేదు. మిల్లులకు తరలించడం లేదు. దీంతో రైతులే మక్కలను బస్తాల్లో నింపుకొని, కాంటాలు పెట్టి సొంతంగా ట్రాక్టర్లను సమకూర్చుకొని మిల్లులకు తరలిస్తే సకాలంలో దిగుమతి కాక ఇబ్బంది పడుతున్నారు.
దంతాలపల్లి శివారు నర్సింహులపేట మండలం పడమటిగూడెం రెవె న్యూ పరిధిలోని పత్తి మిల్లులో మక్కల నిల్వ కోసం అధికారులు గోదా ము ఏర్పాటు చేయగా, రైతులు మక్కల లోడ్‌తో ట్రాక్టర్లను తరలించారు. ఒకేసారి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు తరలిరావడం, వెంటవెంటనే అన్లోడ్ కాకపోవడంతో మిల్లు నుంచి సుమారు కిలో మీటర్ పొడవున వరంగల్-ఖమ్మ ప్రధాన రహదారి పక్కన ట్రాక్టర్లు బారులు తీరాయి. మండుటెండల్లో మక్కల దిగుబడి కోసం రైతులు రోడ్లపై పడిగాపులుగాచారు.