పాలకుర్తి, మే 15 : ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సెంటర్లలో వడ్లు కాంటాలు కాక రైతులు చనిపోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత తో ధాన్యం తరలింపు ఆలస్యమవుతున్నదని, పాలకుర్తి నియోజకవర్గంలోని చర్లపాలెం, పోచంపల్లి కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు వడదెబ్బతో మృతి చెం దారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. గురువా రం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, అతడే స్వయంగా అప్పు పుట్టడం లేదని చెప్పడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ 16 నెలల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఆన్యాయం జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డివి బోగస్ మాటలు తప్ప అభివృద్ధి, సంక్షేమం కనిపించ డం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక పక్క కాం టాలు కాకపోగా, మరోవైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కోనుగోలు కేంద్రాలను మంత్రులు, ఎమ్మెల్యే లు సందర్శించలేదన్నారు. కల్లాల్లో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ర్టాన్ని దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతుబంధు వేషాలు వేస్తున్నారన్నారు. సన్న వడ్లకు బోనస్ పడడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం ఖాయమన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురు లేదని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, రజతోత్సవ సభతో రాజకీయాల్లో మార్పు వచ్చిందని ఎర్రబెల్లి అన్నారు.
సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీనాయ క్, పార్టీ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆ శోక్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కారుపోతుల వేణు, జర్పుల బాలునాయక్, ధరావత్ యాకూబ్‌నాయక్, గుగ్గిళ్ల యాకయ్య, అల్లమనేని రమేశ్‌రావు, గర్వందుల మల్లేశ్, జోగు గోపి, బానోత్ మహేందర్, కడుదుల కరుణాకర్‌రెడ్డి, కత్తి సైదులు, వీరమనేని సోమేశ్వర్రావు, ఎండీ నాసర్, బొడిగె ప్రదీప్, దొంతమల్ల గణేశ్, లకావత్ వెంకట్, సురేశ్, జీ రాజు, బీ రవివర్మ, జీ శ్రీనివాస్, జీ రాఘవులు, గీ సమ్మయ్య, జీ ఆంజయ్య, జీ రాజు పాల్గొన్నారు.