దుగ్గొండి, జూలై,03: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలు తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాల ముందు బారులు తీరారు. మండలంలోని మందపల్లి ప్రాథమిక సహకార సంఘంలో రైతుకు రెండు బస్తాల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని, ఈమేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారని సొసైటీ సిబ్బంది తెలిపారు. ఖరీఫ్ సీజన్లో సాగుకు ముందే రైతన్న యూరియా బస్తాల కోసం అష్ట కష్టాలు ప్రారంభమయ్యాయని, మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.