మల్హర్, జూలై 13 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్లకు చెందిన రైతు ఆకుల ఓదెలు (76) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కొయ్యూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెలు తనకున్న వ్యవసాయ భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు.
ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం తోటకు నీళ్లు కట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ తీగకు తగలడంతో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.