చిట్యాల(మొగుళ్లపల్లి), జూన్ 8 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యార రాజిరెడ్డి(58) తన ఇంట్లోని వడ్లు పట్టించేందుకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టాటా ఏస్ వాహనాన్ని కిరాయికి మాట్లాడుకున్నాడు.
వాహనం ఇంటి ఆవరణలోకి వస్తుండగా, కరెంటు సర్వీస్ వైరు తగులుతుందని భావించి చేతితో పైకి ఎత్తాడు. వైరు పేలిపోయి ఉండడంతో విద్యుదాఘాతానికి గురై అకడికకడే మృతిచెందాడు. రాజిరెడ్డి భార్య యార పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.