హనుమకొండ, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అభాసుపాలవుతున్నది. నిబంధనల అమలుపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన ‘ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్’ అర్హతను ఎక్కువ మంది ఉద్యోగులు అక్రమంగా వాడుకుంటుండగా, అర్హులకు అన్యా యం జరిగేలా ఈ వ్యవహారం సాగుతున్నది. బదిలీల ప్రక్రియలో భాగంగా అన్ని శాఖల ఉద్యోగులు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చారు. నాలుగేండ్లు ఒకేచోట పని చేసి న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొన్నది. ఎస్సీ అభివృద్ధి శాఖలో ఎనిమిదేండ్లు గడిచినా ఒకేచోట పని చేసేలా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి జోన్ 4 పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖ మ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని గ్రేడ్ 1, గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చారు. వీరికి ఎస్సీడీడీ కమిషనర్ కార్యాలయంలో కౌన్సెలిం గ్ ద్వారా సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు జరుగుతాయి. ఆప్షన్లు ఇచ్చిన వారి సీనియారిటీ జాబితాను జోనల్ నోడల్ ఆఫీసర్ హోదాలో హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రూపొందిస్తారు.
ఈ నెల 28లోపు ఈ ప్రక్రియ ముగియనుండగా, జాబితా రూపకల్పన సమయంలోనే నిబంధనలను ఉల్లంఘిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యో గ సంఘాల ప్రతినిధులు (ఆఫీస్ బేరర్) కోటాలో అనర్హులను బదిలీల నుంచి మినహాయించి పాత పోస్టింగులోనే కొనసాగించేలా వ్యవహారం జరుగుతున్నదనే ఆరోపణలున్నాయి. 4వ జోన్ పరిధిలో 40 మంది ఉద్యోగులకు బదిలీ అర్హత ఉన్నది. అయితే వీరు ఆప్షన్లు ఇచ్చిన 10 పోస్టులను ఉద్యోగ సంఘాల నాయకుల కోటాలో కొత్త వారు రాకుండా బ్లాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అందరూ ప్రతినిధులే..
ప్రభుత్వం నిర్వహించే బదిలీల ప్రక్రియ లో స్పౌజ్, మెడికల్, వితంతువుతోపాటు గు ర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయం, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్య శాఖలోని సంఘాలే కాకుండా తెలంగాణ నాన్ గెజిటెడ్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్లు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ సంఘాల్లోనూ ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఒక జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్‌లకు మాత్రమే బదిలీల నుంచి మినహాయింపు లేదా జిల్లా కేంద్రంలో పోస్టింగ్ పొందే అవకాశం ఉం టుంది.
ఈ రెండు సంఘాల్లోని ముఖ్య పదవులతో నిమిత్తం లేకండా ఎస్సీ అభివృద్ధి శా ఖలోని 10 మంది ఉద్యోగులు ఇతర సంఘా ల ప్రతినిధులమని పేర్కొంటూ డిప్యూటీ డైరెక్టర్‌కు లేఖలు అందించినట్లు తెలిసింది. ని బంధలన ప్రకారం ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్ల కోటాలో బదిలీల నుంచి మినహాయింపు పొందాలంటే 2025 జూలై 31లోపే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రికార్డులు ఉండాలి. సహకారశాఖ ఏటా నిర్వహించే ఆడిట్లో నూ వీరి నియామకాల వివరాలు నమోదై ఉండాలి. ఎస్సీ అభివృద్ధి శాఖలోని పలు సం ఘాల పేర్లతో లేఖలను సమర్పించిన వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిసింది. బదిలీల నుంచి మినహాయింపు ఉన్న సంఘాలను నాకుండా మిగిలిన సంఘాల లేఖలను సమర్పించిన వారికి ఆఫీసు బేరర్ కోటాలో మినహాయింపు ఇస్తుండడం వల్ల అర్హులకు అన్యాయం జరగనున్నది.
కమిషనర్ ఆఫీసుకు పంపిస్తాం
జోనల్ పోస్టుల్లో పని చేస్తున్న 144 మంది వార్డెన్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు బదిలీల కోసం సర్వీస్ మ్యాటర్స్ వివరాలు, ఆఫీస్ బేరర్స్, హెల్త్ సమస్య, స్పౌజ్ వివరాలన్నింటికీ ఆయా జిల్లాల అధికారుల నుంచి సేకరించి కమిషనర్ ఆఫీస్‌కు పంపించాం. మళ్లీ కొత్త ఫార్మాట్ ప్రకారం ఈనెల 28లోపు పంపిస్తాం. ఈనెల 29న బదిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆఫీస్ బేరర్స్, స్పౌజ్, మెడికల్ కోటా వివరాలను బయటకు వెల్లడించలేం.
– బీ నిర్మల, ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ (భద్రాద్రి జోనల్ నోడల్ ఆఫీసర్)