Warangal | వరంగల్ చౌరస్తా : వరంగల్ నగరంలోని పిన్నవారి వీధిలో కాలం చెల్లిన నిత్యావసర వస్తువులను అమ్ముతున్న వ్యాపారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు తన సిబ్బందితో వరంగల్‌లోని పిన్నవారి వీధిలో పబ్బతి కృష్ణమూర్తి నడుపుతున్న ఉదయ లక్మి కిరాణంలో తనిఖీలు నిర్వహించారు. హార్పిక్, డొమెక్స్, హాండ్స్ ఆన్, బజాజ్, స్పిన్జ్, పారచుట్, డేటాల్ లాంటి వివిధ కంపెనీలకు చెందిన వస్తువులను గడువు దాటిన తర్వాత కూడా అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించి.. పబ్బతి కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. పట్టుబడిన కాలం చెల్లిన వస్తువుల విలువ సుమారుగా రూ. 1,23,500 వరకు విలువ ఉంటుందని తెలిపారు. షాప్ యజమాని పబ్బతి కృష్ణ మూర్తి ని విచారణ నిమిత్తం మున్సిపల్ అధికార్లకు అప్పగించడం జరిగింది. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ఆర్ఎస్ఐ భాను ప్రకాష్, వరంగల్ మున్సిపల్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కానిస్టేబుల్స్ సురేష్, సురేందర్, సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.