హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఎంఈ/ఎంటెక్, ఎం ఫార్మ సీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను జేఎన్టీయూహెచ్ సోమవారం విడుదల చేసింది. నిరుడు చివరగా రూ. 5వేల ఫైన్‌తో దరఖాస్తుకు అవకాశమివ్వగా, ఈ సారి రూ. 10వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసే వీలు కల్పించారు.
పరీక్షకు రెండు రోజుల ముందు వరకు అవకాశం ఉం టుందని పీజీఈసెట్ కన్వీనర్ వెంకటేశ్వర్రావు తెలిపారు. వివరాలకు https:// pgecet. tgche. ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.