Fishermen | విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతు
Fishermen | విశాఖపట్నం(Visakhapatnam) నుంచి బోటులో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు(Seven fishermen) తుఫాను ప్రభావంతో గల్లంతయ్యారు.
Fishermen | ఏపీలో విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి బోటులో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు(Seven fishermen) తుఫాను ప్రభావంతో గల్లంతయ్యారు. ఈ నెల 1న ఏడుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కుటుంబ సభ్యులు వారికి ఈ విషయాన్ని చేరవేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి చేరుకుంటామని ఫోన్ చేసి చెప్పారు. శనివారం సాయంత్రం వరకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారికి పోన్ చేయడంతో ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి.
దీంతో కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు గల్లంతైన జాలర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారు ఆరుగురు ఉండగా, మరొకరు భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం వాసిగా గుర్తించారు. గల్లంతైన జాలర్లలో కే. సీతడు, గరగయ్య, బండియ్య, అమర అప్పలరాజు, మెడ చిన్న అమ్మెరు, కారి చిన్న, కె. చిన్నయ్య ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

