Road accident | నల్లగొండ(Nalgonda )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర చోటు చేసుకుంది.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రుడిని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.