వర్ధన్నపేట, ఏప్రిల్ 22 : గ్రామీణ ప్రాంత పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందనున్నది. సీఎం కేసీఆర్ ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్యం, వి ద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానలు, పాఠశాలలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వసతులు కల్పిస్తున్నారు. ఇటీవల వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల హాస్పిటల్‌గా మార్చాల ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ రోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావులను కోరారు. అలాగే శా శనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దృష్టికి తీ సుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం సీహెచ్‌సీని 100 ప డకల దవాఖానగా మార్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే దవాఖాన భవనంపై మరో అంతస్తు నిర్మిస్తున్నారు.
వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో గణనీయం గా ప్రసవాల సంఖ్య పెరిగింది. ఇటీవల ఎమ్మెల్యే అరూ రి ప్రజల సమక్షంలో వైద్యులతో సమీక్ష నిర్వహించా రు. ప్రజలు, వైద్యులు దవాఖానలోని పలు సమస్యల ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, ప్రాధాన్యతా క్రమం లో వాటిని పరిష్కరిస్తున్నారు. దీంతో గతంలో ప్రతి నెలా 50 నుంచి 100 మాత్రమే ప్రసవాలు జరుగగా, ఇప్పుడు ఆ సంఖ్య 200లకు చేరింది. వైద్యులు నిబద్ధతతో పనిచేయడం, మెరుగైన వసతులు కల్పించడంతో గర్భిణులు పెద్ద సంఖ్యలో దవాఖానకు వస్తున్నారు. దవాఖానను 100 పడకలకు విస్తరిస్తే మరింత రద్దీ పెరుగడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానున్నది.
వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానను మెరుగుపర్చేందుకు ఎమ్మెల్యే రమేశ్ చేసిన కృషి ఫలిస్తున్నది. 6 సంవత్సరాల క్రితం వర్ధన్నపేట సీహెచ్‌సీలో నెలకు ఐదుకు మించి ప్రసవాలు జరిగేవి కావు. ఇతర వైద్య పరీక్షలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో పేదలు ఇక్కడకు వచ్చేవారు కాదు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అరూరి రమేశ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వా త దవాఖానను అభివృద్ధి చేశారు. వైద్యులు, సిబ్బంది ని నియమించడంతో హాస్పిటల్‌కు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా 200లకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి.
– డాక్టర్ నర్సింహస్వామి, సీహెచ్‌సీ సూపరింటెండెంట్
వర్ధన్నపేట సీహెచ్‌సీ త్వరలోనే 100 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ కానున్నది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ మరో 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయి అనుమతులు రాగానే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హాస్పిటల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైద్యులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్, జిల్లాస్థాయి వైద్యాధికారులు చేయూతనిస్తున్నారు. పేదలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.