వరంగల్, సెప్టెంబర్ 25 : బల్దియాను మ రో జాతీయ అవార్డు వరించింది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ద్వారా బల్దియాకు ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ లభించింది. మూడేళ్లుగా నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్ హు డ్ చాలెంజ్ పోటీల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ టాప్-5లో చోటు దక్కించుకుంది. బెంగళూరు, ఇండోర్, జబల్పూర్, కొచ్చి నగరాల సరసన నిలిచింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కా ర్యక్రమంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ మిషన్ డైరెక్టర్ రాహుల్ కపూర్ చేతుల మీదుగా ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్‌ను బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఏఈ కార్తీక్‌రెడ్డి అందుకున్నారు.
వరంగల్ కార్పొరేషన్ ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ అందుకోవడం సంతోషంగా ఉందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. నర్చరింగ్ నైబర్ హుండ్ చాలెంజ్‌లో భాగంగా నిధులు మంజూరు చేసి నిర్దేశిత సమయంలో పార్కులను నిర్మించాలని పోటీ పెట్టిందని తెలిపారు. ఎంహెచ్ నగర్లో 56 గంటల్లో చిట్టి పార్క్‌ను నిర్మించి బల్దియా రికార్డు నెలకొల్పిందని పేర్కొన్నారు. క్రిష్టియన్ కాలనీ, కరీమాబాద్ గుండు బావులు, శ్రీనగర్‌కాలనీల్లో సెన్సోరి పార్కులు, ఎల్పీ స్కూల్లో సైన్స్ పార్కు, అంబేద్కర్ కూడలిలో బు ద్ధ ప్లాజాలు నిర్ధేశిత సమయంలో నిర్మించడంతో ఈ అవా ర్డు దక్కిందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులకు అభినందనలు తెలిపారు.