సంగెం, జనవరి 30 : ఎమ్మెల్సీ ఎన్నికల సాకు చూపి వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ మహారాజ్ తండాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బానోత్ తిరుపతి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధ్యయన కమిటీ పరామర్శించకుండా కాంగ్రెస్ అడ్డుకున్నదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోలీసులపై ఒత్తిడి చేసి కమిటీ సభ్యులు, మాజీ మంత్రి హరీశ్‌రావు రాకుండా అనుమతిని రద్దు చేయించారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన సంగెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 420 మంది ప్రాణాలు తీసుకున్నారని అన్నారు.
రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకోకుండా భరోసా కల్పించేందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారన్నారు. మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని, రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అధ్యయన కమిటీ పర్యటన జరిగితే కాంగ్రెస్ కనుమరుగవుతుందని భయపడి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి, వారి సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. రైతు బీమా, రైతుబంధు, అందుబాటులో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు పండిన పంటలకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్‌రెడ్డి ఆనవాళ్లే లేకుండా పోయే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయన్నారు. కోర్టు అనుమతితో ఫిబ్రవరి 1న పల్లారుగూడలో సమావేశాన్ని నిర్వహించుకుంటామన్నా రు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, నాగార్జునశర్మ, గోవర్ధ్దన్గౌడ్, వేల్పుల కుమారస్వామి, మాజీ సర్పంచ్‌లు గుండేటి బాబు, బిచ్చానాయక్, కుమారస్వామి, నాయకులు బోంపెల్లి దిలీప్‌రావు, సుతారి బాలకృష్ణ, సదానందం, వీరేశం, కొనకటి మొగిలి, నర్సింహస్వామి, పులి వీరస్వామిగౌడ్, పెంతల అనిల్, దోపతి సమ్మయ్యయాదవ్, గన్ను సంపత్, కిషన్‌నాయక్, మైముద్దీన్, యుగేంధర్ తదితరులు పాల్గొన్నారు.