రాయపర్తి, అక్టోబర్ 4 : రాష్ట్రంలో క్రమక్రమంగా ఉనికిని కోల్పోతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కందుకూరి రేణుక-యాకయ్య దంపతులు కాంగ్రేస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి ఎర్రబెల్లి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అలాగే, మండలంలోని పెర్కవేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పోషాల రాజు కూడా దయాకర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మినహా ఏనాడు కన్పించని ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యంగా అలుపెరుగని పోరాటాలు చేసిన సీఎం కేసీఆర్‌కే భవిష్యత్తులో రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో మండల ప్రజలు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుల మాటలు, గుప్పిస్తున్న డబ్బు సంచులకు ప్రజలు ఆశపడి ఓట్లు వేస్తే గోసలు పడకతప్పదని హెచ్చరించారు. నూతనంగా పార్టీలో చేరుతున్న కార్యకర్తలందరినీ సమాన స్థాయిలో ఆదరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చిన్నాల తారాశ్రీ రాజబాబు, మండల శ్రీధర్, మహ్మద్ అన్వర్, కత్తి యాకయ్య, గుమ్మడిరాజుల శ్రీనివాస్, చెనబోయిన యాకయ్య, కత్తి సోమన్న, ఎల్లయ్య, మండల సమ్మయ్య, కత్తి వెంకన్న, ముప్పిడి సంజీవ, ముప్పిడి రమేష్, చిన్న సంజీవ, ఎదునూరి సారయ్య, చెనబోయిన సురేశ్చ మంగిశెట్టి రాజు, నిమ్మల రాజు పాల్గొన్నారు.
చిన్నారి చేత గోరు ముద్ద..
తొర్రూరు : మంత్రి ఎర్రబెల్లి గుర్తూరులో తన కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్తుండగా ప్రభుత్వ సూల్ విద్యార్థులను గమనించి వారితో ముచ్చటించారు. ఈ క్రమంలో దళిత విద్యార్థి మంగళంపల్లి తేజ్‌కుమార్ భోజనం తింటుండగా.. మంత్రి బువ్వ మంచిగున్నదా? అని అడిగా రు. అనంతరం విద్యార్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముద్దలు తినిపించారు.