హనుమకొండ చౌరస్తా, మే 11: ఆదివారం విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన వీ నాగసిద్ధార్థ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 32వ ర్యాంకు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో మేడ కార్తీక్ 234, జోగు అభిరామ్ 471, బైపీసీ విభాగంలో ఎం వినయ్ 149, ఎండీ అబ్దుల్లా మొయినుద్దీన్ 162వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే కే అంజనా సంతోషి 178, పీ సాయిదివ్యన్ 183, కే సాయికిరణ్ 200, జీ సాయిహర్షిణి 268, వై స్నేహితరెడ్డి 390, కే ఏంజిల్ 412, వీ ప్రత్యున్నరెడ్డి 475, తోట ప్రణయ్ 496, మహమ్మద్ షాహిద్ రెహాన్ 513, చల్లా అన్సిక 539 ర్యాంకు సాధించారన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సంవత్సరం తమ విద్యార్థులు జేఈఈ (మెయిన్)లో జాతీయస్థాయిలో సాధించిన ఉత్తమ ర్యాంకులు స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.