హనుమకొండ చౌరస్తా, మే 10 : ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఈ సారి కూడా జిల్లాలో, రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఏడాది 112 మంది 10/10 జీపీఏ సాధించినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనుగందుల వరదారెడ్డి తెలిపారు. ఇంతటి విజయానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్యా, పటిష్ఠమైన పాఠ్యప్రణాళిక, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ బృందమేనని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరణలో పెడుతూ ఒత్తిడిలేని వాతావరణంలో, క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నట్లు వివరించారు. ఎస్సార్ విద్యాసంస్థల్లో పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా విద్యార్థులకు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బృహత్తరమైన పద్ధతిలో ప్రైమ్ స్కూల్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అఖండ విజయంలో విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందనలు తెలిపారు.