ఖిలా వరంగల్: పెండింగ్‌లో ఉన్న 12 నెలల వేతనాలు ఇప్పించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్‌యూనియన్ ఆధ్వర్యంలో గొరెకుంటలోని ఈఎస్ఐ హాస్పిటల్ సెక్కూరిటీ గార్డులు, స్వీపర్లు సోమవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదను కలిసి వినతి పత్రం సమర్పిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు.
దవాఖాన అధికారులను కలిసినప్పటికి వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ను అడిగితే ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు రాలేదని చెబుతున్నారు. దయచేసిన వేతనాలు ఇప్పించాలని కలెక్టర్‌ను వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, బీ సతీష్, విజయ, రజిత,. ప్రవీణ్, రేణుక, శ్రీనాథ్, ఎండీ సికిందర్‌ఖాన్ తదితరులున్నారు.