రాయపర్తి, సెప్టెంబర్ 9 : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, భారత రాష్ట్ర సమితి నాయకురాలు ఉషాదయాకర్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పలు రకాల సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను ఆమె నేరుగా కలిసి పరామర్శించారు. మండలంలోని కొత్తూరులో మృతి చెందిన చింత వినోద్‌కుమార్, బీమని యాకమ్మల కుటుంబాలతో పాటు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిమ్మ మోహన్‌ను ఆమె కలిసి ఓదార్చారు.
అదే విధంగా మండలంలోని కొం డూరులో ఇటీవల మృత్యువాతపడిన గంగారపు నర్సయ్య, గుండె బన్నీ, గోలి అనసూర్య, ఎదుళ్ల యాకస్వామి, రామారపు మల్లయ్యల కుటుంబాలను ఆమె కలిసి పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె వెంట భారత రాష్ట్ర సమితి మండలాధ్యక్షుడు నర్సింహ్మానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగుకుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కర్ర సరితారవీందర్రెడ్డి, కందికట్ల స్వామి, కుందూరు రాంచంద్రారెడ్డి, నాళ్లం రవి, అంబటి రమాదేవి, కుందూరు యాదగిరిరెడ్డి, తాటికాయల భాస్కర్, దేశబోయిన ఉపేందర్, పెండ్లి వెంకన్న, చిర్ర కిశోర్‌కుమార్, ఎల్లాగౌడ్, రాములు, మహేశ్, కేశవరెడ్డి, సోమన్న పాల్గొన్నారు.
జయరాంతండాలో మున్యానాయక్ విగ్రహావిష్కరణ..
మండలంలోని జయరాంతండా(కే)కు చెందిన భారత రాష్ట్ర సమితి మండల సీనియర్ నాయకుడు లావుడ్య మున్యానాయక్ ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు గ్రామ క్రాస్ రోడ్డు సమీపంలో మున్యానాయక్ స్మారకార్థం ఏర్పాటు చేసిన మున్యానాయక్ విగ్రహాన్ని ఉషాదయాకర్‌రావు, బాధిత కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మున్యానాయక్ స్మృతి వనంలో నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఆమె వెంట మండల నాయకులు వాసూనాయక్, వాచ్యానాయక్, వంగాల నర్సయ్య, సుదర్శన్, వెంకటేశ్వర్లు, నరేశ్‌కుమార్, నవీన్‌కుమార్, వెంకన్న, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.