హనుమకొండ(ఐనవోలు): మృతుడి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మండలంలోని పెరుమాండ్లగూడెంలో వర్ధన్నపేట మండల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి మామ దుపెల్లి రాజయ్య గురువారం మృతి చెందాడు. కాగా, విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి రాజయ్య పార్థీవదేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్ రావు, మాజీ ఎంపీపీ అప్పారావు, మాజీ జడ్పీటీసీ భిక్షపతి, మాజీ సర్పంచులు దుప్పెల్లి కొండయ్య (డీకే), కవాటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.