రాయపర్తి : బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరికి కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. జేతురాం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రావుల తండాకు చెందిన బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నేతావత్ మన్సూర్ నాయక్ తండ్రి నేతావత్ తారాచంద్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
అదేవిధంగా జేతురాంతండాకు చెందిన గుగులోత్ రూప్లా నాయక్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎర్రబెల్లి బాధితుల నివాసాలకు చేరుకుని పరామర్శించారు. తారాచంద్ అకాల మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గుగులోత్ రుప్లా నాయక్ మెరుగైన వైద్య సేవలు పొందాలని సూచించారు.
బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితి పక్షాన తాము అండగా ఉండి ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, లేతాకుల రంగారెడ్డి, పూస మధు, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, చందు రాము యాదవ్, ఉబ్బని సింహాద్రి, కొమ్ము రాజు, నేతావత్ రవి నాయక్, పెద్దగాని జీవన్ గౌడ్, గుగులోతు శ్రీనివాస్ నాయక్, అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.