దేవరుప్పుల/పాలకుర్తి, మార్చి 12: ప్రభుత్వం వద్ద యాసంగి సాగునీటి ప్రణాళిక లేకపోవడం వల్లే పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను అక్రమంగా అరెస్టు చేయడంతో బుధవారం పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారికి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా దేవరుప్పులలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాసంగికి ముందే కాళేశ్వరం, దేవాదుల నీటిని పంపింగ్ చేసి రిజర్వాయర్ల ద్వారా నీటిని వదిలి చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపేదన్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి 24 గంటల కరెంట్‌తో బోర్లు పోయడంతో ఒక్క ఎకరం ఎండకుండా రైతులు పదేళ్లు పంటలు పండించారన్నారు.
ఈ ప్రణాళిక కొరవడడం వల్లనే పంటలు పూర్తిగా ఎండాయని, దీనికి ప్రభుత్వం బాధ్య త వహించాలన్నారు. గత పదేళ్లుగా ఆర్థిక సమృద్ధిని సాధించిన రైతులు నేడు పదేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి వచ్చిందన్నారు. పంటల పెట్టుబడి, వేసిన కొత్త బోర్లు వెరసి ఒక్కో రైతు రూ. లక్షల్లో నష్టపోయాడని, వారికి నష్టపరిహారం చెల్లిస్తారా.. అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. పాలకుర్తి నియోజకవర్గంలో సాగునీటి కరువు ఉందని, బోర్లు పోయక వరి, మక్కజొన్న, మిరప పంటలు ఎండాయన్నారు. ముందస్తుగా ఇటు దేవాదు ల, అటు ఎస్సారెస్పీ నీటిని వదిలితే రైతులు బాగుపడేవారన్నారు.
పంటలు వేసి చేతికొచ్చే సమ యంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులు పంటలు వేయొద్దని, భూగ ర్భ జలాలు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అదేదో మొదలే చెబితే రైతులు యా సంగి పంటలు వేయకుండా ఉండేవారన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన ఈ సర్కారుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతున్నద ని ఎర్రబెల్లి అన్నారు.
14నెలలు గడిచినా మాజీ సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించకపోవడం దారుణ మని, ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతున్నదన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంలో పించిందని, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, చెట్లు ఎండిపో తున్నాయన్నారు.
కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, జీపీ ట్రాక్టర్లు నడపలేని స్థితిలో పంచాయ తీలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు లేక గ్రామాల్లో నీటి కొరత ఏర్పడిందని, దేవాదుల నీళ్లు రాక పంట పొలాలు ఎండుతున్నాయన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్‌రెడ్డి బుద్ధి మార్చుకోవాలని సూచించారు. 14 నెలలుగా కేంద్రం నుంచి రూపాయి రావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వం భయపడుతున్నదని, బడా కాంట్రాక్టర్లు, కమిషన్లపై ఉన్న చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్ లపై లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తున్నదన్నారు. బీఆర్ఎస్కు మద్దతు పెరుగుతున్నదని, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని, ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరు కుంటున్నారని పేర్కొన్నారు.
పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధగాని కర్ణాకర్, రామ్మోహన్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి దయాకర్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వోనించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కారుపోతుల వేణు, మాజీ సర్పంచ్‌లు కల్వల భాస్కర్‌రెడ్డి, పుస్కూరి కళింగరావు, ఇమ్మడిప్రకాశ్, నకీర్త యాక య్య, ఆనపర్తి శాంతయ్య, కోల రమేశ్, లక్ష్మణ్, బానోత్ మహేందర్, యాకూబ్, ధరావత్ దేవా, బాలూనాయక్, లకావత్ సురేశ్, ఎడవెల్లి కృష్ణ పాల్గొన్నారు.