పాలకుర్తి/ పెద్దవంగర/ తొర్రూరు/ రాయపర్తి, అక్టోబర్ 9 : బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలాడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. గురువారం పాలకుర్తి, తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో బా కీ కార్డులను విడుదల చేయడంతోపాటు పెద్దవంగర, రాయపర్తిలో ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఆరు గ్యా రెంటీలు, 420 హామీలపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి నా యకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని చిత్తుగా ఓడించాలన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీని రైతులు, ప్రజలు ఉరికించి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు నిలబడాలంటే వణుకు పుడుతుందని చెప్పారు.
యూరియా సకాలంలో అందక పంటలు పాడైపోయాయన్నారు. కేసీఆర్‌ను గుర్తుకు చేసుకుంటున్నారని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ శ్రేణులు బాకీ కార్డులను పోల్ చిట్టీల లాగా ఇంటింటికీ పంపిణీ చేసి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు. పాలకుర్తి ని యోజకవర్గంలోని అన్ని స్థానాల్లో గులాబీ గెలవడం ఖాయమన్నారు. ఆపతాలంలో పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని నాయకులకు సూచించారు.
సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామిరెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు పసునూరి నవీన్, ఐలయ్య, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కార్యదర్శి సంజయ్, ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు యాదగిరిరావు, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, మాజీ జడ్పీటీసీ గుగులోత్ పార్వతి, నాయకులు జర్పుల బాలునాయక్, వీరమనేని సోమేశ్వర్రావు, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, కత్తి సైదులు, మాటూరి యాకయ్య, బానోత్ మహేందర్, ఎండీ నాజర్, బొడిగే ప్రదీప్, కటారి పాపారావు, గర్వందుల మల్లేశ్, జోగు గోపీ, కోల నారాయణ, ఉప్పల సాయి, పోశాల వెంకన్న, జుమ్మీలాల్, పుర్మ రఘుపాల్‌రెడ్డి, మల్యాల పరశురాములు, బొడిగె ప్రదీప్, బీరెల్లి రవివర్మ, లకావత్ సురేశ్, వెంకట్ సుధీర్‌కుమార్, జ్ఞానేశ్వరాచారి, వెంకట్రామయ్య, శ్రీనివాస్, వీరన్నయాదవ్, వెంకన్న, సుధాకర్, సమ్మయ్య, రఘు, అశోక్, రాము, సత్యనారాయణ, ప్రభాకర్, చంద్రయ్య, భాస ర్రావు, భిక్షపతి, హరీశ్, అనుదీప్, రాజు, మహేశ్, సతీశ్, దయాకర్ పాల్గొన్నారు.
పాలకుర్తి మండలంలోని లక్ష్మీనారాయణపురం, భీక్యానాయక్ పెద్ద తండాలకు చెందిన సీనియర్ నాయకుడు కట్ల నారాయణ, తూడి భాస్కర్, మైబాషా, గుగులోత్ దస్ర్తునాయక్లతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి దయాకర్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.